ప్రభాస్ సినిమా ప్రారంభమైంది !

13th, February 2017 - 12:54:40 PM


‘బాహుబలి’ చిత్రంతో హీరో ప్రభాస్ నేషనల్ లెవల్ గుర్తింపు పొంది, టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు ప్రతిమ పెట్టే స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ ఇంతలా కీర్తి పొందటం ఆయన అభిమానులకు సంతోషంగానే ఉన్నా మరోవైపు ఇన్నేళ్ల పాటు కేవలం రెండు సినిమాలకే పరితమవడం మాత్రం వారిని కాస్త నిరుత్సాహపరిచింది. అందుకే బాహుబలి షూట్ పూర్తయిందని తెలియాగానే నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలుపెడతారోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. వాళ్ళ ఆశలను నెరవేరుస్తూ ఈరోజు ప్రభాస్ కొత్త చిత్రం అధికారికంగా లాంచ్ అయింది.

ప్రభాస్, దర్శకుడు సుజీత్, కృష్ణం రాజుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో చిత్ర ప్రారంభోత్సవం సాంప్రదాయబద్దంగా జరిగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ బాహుబలి తర్వాత రెబల్ స్టార్ కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.