వైరల్ : “సలార్” సెట్స్ లో వాళ్ళకి ప్రభాస్ నుంచి ఆగని ఫుడ్ ట్రీట్.!

Published on May 29, 2022 10:06 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం తెలిసిందే. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

అయితే ప్రభాస్ తన సినిమా షూటింగ్ టైం లో ప్రతి ఒక్కరిని ఎంత జాగ్రత్తగా ప్రేమగా ట్రీట్ చేస్తాడో తెలిసిందే. ఇప్పుడు సలార్ ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో కూడా సెట్స్ లో ఉండే వారు అందరికీ తన తన ప్రేమతో ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతి రోజు కూడా అందరికీ తానే ఆహారం తెప్పిస్తూ వారికి వడ్డిస్తూ తన లోని పూడీని బయటపెడుతున్నాడు.

ప్రభాస్ మంచి ఫుడీ అని అందరికీ తెలిసిందే. తాను తినడం కన్నా ప్రేమగా ఇతరులకు పెట్టడం ప్రభాస్ కి ఎంతో ఇష్టం ఇప్పుడు ఇలాగే సలార్ సెట్స్ లో నడుస్తుండగా ఒక హ్యాపీ మూమెంట్ ని హీరోయిన్ శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చెయ్యగా అది ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :