“సలార్”కి తప్పని లీక్‌ల బెడద.. బయటకొచ్చిన ప్రభాస్ ఫోటో..!

Published on Jan 30, 2022 12:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో “సలార్” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగండూర్‌ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సమయంలోనే సలార్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్‌లో ప్రశాంత్ నీల్ ఉన్నాడని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్ నుంచి ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఏదో ఫైట్‌ సీన్‌లోని ఫోటో అన్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్‌లో, కాస్త కోపంతో నిలబడ్డాడు. ఇక గతంలోనూ సలార్‌ సెట్స్‌ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు లీకై నెట్టింట హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటించనున్నాడని టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం :