స్ట్రయిట్ హిందీ సినిమాను ప్లాన్ చేసిన ప్రభాస్ !

20th, September 2017 - 04:51:21 PM


‘బాహుబలి’ తో నేషనల్ లెవల్ ఫేమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కు బాలీవుడ్ నుండి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు భారీ రేట్లు పలుకుతుండగా పలువురు టాప్ హిందీ హీరోయిన్లు, ఇతర నటీనటులు ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక దర్శక నిర్మాతలైతే ప్రభాస్ మార్కెట్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఆయనతో సినిమా చేసేందుకు ఎప్పుడైనా సిద్దమే అంటున్నారు.

ఈ ఆఫర్ల పట్ల సుకుఖంగానే ఉన్న ప్రభాస్ కూడా బాలీవుడ్లో డైరెక్ట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తర్వాతి సినిమాల జాబితాలో ఇది కూడా ఉంది. ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చేస్తున్న ఆయన దాని తర్వాత రాధా కృష్ణ కుమార్ తో ఒక లవ్ స్టోరీని చేసి ఆ తర్వాత హిందీ సినిమా చేయనున్నారు. అయితే ఈ హిందీ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారు, చిత్రం ఏ లెవల్లో ఉండనుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.