ప్రభాస్ కారుకి ఫైన్స్.. ఎలాంటి సంబంధం లేదటూ క్లారిటీ..!

Published on Apr 16, 2022 10:38 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్స్ వేశారంటూ శనివారం ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ప్రభాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని మూడు ఛలాన్‌లు విధించారని నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1,450 జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ పిఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఈ రోజు హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ గారి కారుకి హైదరాబాద్ పోలీస్ వారు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, హీరో ప్రభాస్ గారికి ఎలాంటి సంబంధం లేదని తెలియచేస్తున్నాం దయచేసి గమనించగలరంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వార్త అవాస్తవమని తెలుస్తుంది. వేరే కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని, అది ప్రభాస్ కారు అని పొరపాటు పడ్డారని తెలిపారు.

సంబంధిత సమాచారం :