పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన లైనప్‌లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అయితే, ప్రభాస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ సినిమాను చేస్తాడని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకు ‘బాకా’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది.
ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో తెరకెక్కాల్సిన ఈ సినిమా అటకెక్కిందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇలా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ప్రభాస్‌తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.
