రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ మూవీ సందడి … !!

Published on Jul 19, 2022 9:00 pm IST

పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం ఒక్కో సినిమాతో మంచి క్రేజ్, ఫాలోయింగ్ సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న ప్రభాస్, లేటెస్ట్ గా మొత్తం మూడు మూవీస్ చేస్తున్నారు. అందులో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కె. యువ దర్శకుడు నాగ అశ్విన్ట్ తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మస్తున్నారు.

గత కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రాజక్ట్ కె మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ప్రస్తుతం హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా లతో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్న కొన్ని కీలక సీన్స్ తీస్తుందట యూనిట్. ఇక ఈ మూవీ షూట్ తో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ అంతటా మంచి కోలాహలం నెలకొందట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యువ భామ దిశా పటాని కీలక రోల్స్ చేస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :