ఇండియాస్ మోస్ట్ గ్రాండియర్ యాక్షన్ మూవీ గా ప్రభాస్ ‘ప్రాజక్ట్ – కె’

Published on Sep 17, 2022 3:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి తో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ప్రాజక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ బడ్జెట్ తో సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటుండగా దీనిని 2024 ప్రథమార్ధం లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల నిర్మాత అశ్వినిదత్ ఒక షోలో భాగంగా తెలిపారు.

సైన్స్ ఫిక్షన్ జానర్ లో డిఫరెంట్ సైంటిఫిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్నో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయట. అందుకోసం ఇప్పటికే పలువురు హాలీవుడ్ కి చెందిన దిగ్గజ యాక్షన్ టీమ్ నిపుణులను ప్రాజక్ట్ కె యూనిట్ రప్పించించినట్లు తెలుస్తోంది. అలానే భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా మూవీలో ఉండనున్నాయట. ఇక ఈ మూవీని పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ డ్యూయల్ క్రోమాటిక్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారట. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ విధంగా హై టెక్నీకల్ అంశాలతో పాటు భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ప్రాజక్ట్ కె యావత్ ఇండియాలోనే మోస్ట్ గ్రాండియర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :