ప్రభాస్ వరల్డ్ చిత్రంలో అవకాశం..ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on Sep 7, 2021 9:01 am IST


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో రెండు ఆల్రెడీ ఏకకాలంలో షూట్ కంప్లీట్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా వాటి తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ నే ప్రభాస్ షురూ చేస్తున్నాడు. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఇండియా లోనే అత్యంత ఖరీదైన సినిమాగా దీనిని ప్రెజెంట్ చెయ్యనున్నాడు.

అయితే ఈ సినిమా పరంగా మాత్రం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో చాలా స్పీడ్ గా ఉన్నారు. పైగా లోకల్ టాలెంట్ నే ఇండియా వైడ్ గా ఎక్కువ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మరి ఇంతకు ముందే ఈ సినిమా కోసం పలువురు నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ పెట్టిన మేకర్స్ ఇప్పుడు మళ్ళీ బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆడిషన్స్ పెడుతున్నట్టుగా తెలిపారు.

మరి ఈ భారీ చిత్రంలో కనిపించాలి అనుకునేవారు 12, 15 తేదీల్లో వెళ్లొచ్చు. మరి ఈ అనౌన్సమెంట్ పై డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ని గమనిస్తే అది ఒకింత ఆసక్తిని రేపుతోంది. ఎదురుగా ఒక పెద్ద ద్వారం మెట్లకుండా దాని లోపలికి వెళ్తున్నట్టుగా ప్రభాస్ నించుని ఉన్నట్టుగా చూపిస్తున్నారు.

ఇది చూస్తే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మరి ఇది బహుశా సినిమా ఏదో సన్నివేశానికి చెందిన కాన్సెప్ట్ డిజైన్ కూడా కావచ్చు. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పై ఆసక్తి నెలకొంది. మరి ఇవన్నీ మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి. మరి నాగ్ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :