రాధేశ్యామ్ నుంచి రాబోతున్న అప్డేట్.. రెడీనా..!

Published on Oct 20, 2021 2:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుచూస్తున్న సమయం ఆసన్నమయ్యింది. ‘రాధేశ్యామ్’ సినిమా టీజర్‌పై నేడు ఉదయం అప్డేట్ ఇవ్వనున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :