అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్

prabhas
‘బాహుబలి’ చిత్రం ప్రపంచస్థాయి రికార్డులతో పాటు దానికి పనిచేసిన నటీనటులకు, నిపుణులకు కూడా అరుదైన గౌరవాలు తెచ్చిపెడుతోంది. మొన్నటికి మొన్న ఈ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పద్మ శ్రీ అవార్డును అందుకోగా ఇప్పుడు ఇందులో ‘అమరేంద్ర బాహుబలి’ గా నటించిన ప్రభాస్ ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అదేమిటంటే ప్రముఖ ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’ వారు ప్రభాస్ యొక్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు మ్యూజియం సిబ్బంది ప్రభాస్ ను కలిసి అవసరమైన కొలతలు తీసుకున్నారు. ఏ బొమ్మను 2017 మార్చిలో ఆవిష్కరిస్తారు. ఈ అరుదైన గౌరవం పొందిన మూడవ భారతీయుడు, మొదట దక్షిణ భారతీయ నటుడు ప్రభాస్ కావడం విశేషం. నిన్నటికి నిన్న జక్కన చెప్పిన ‘బాహుబలి 2’ విశేషాలకే ప్రభాస్ అభిమానులు తెగ సంతోషపడిపోతుండగా ఈ వార్త వారికి మరింత ఆనందానికి కలిగించింది. ఈ సందర్భం ప్రతి తెలుగువాడు, ముఖ్యంగా తెలుగు సినీ రంగానికి చెందిన ప్రతిఒక్కరు గర్వించదగ్గ సందర్భం.