రొమాంటిక్ గా ఉన్న “రొమాంటిక్” ట్రైలర్…ప్రభాస్ చేతుల మీదుగా విడుదల!

Published on Oct 19, 2021 4:15 pm IST

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రమ్య కృష్ణ కీలక పాత్ర లో నటిస్తున్నారు. రొమాంటిక్ చిత్రం ట్రైలర్ చాలా రొమాంటిక్ గా ఉండటం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :