ఇండియా లోనే నంబర్ వన్ హీరోగా ప్రభాస్..!

Published on Nov 24, 2021 1:54 am IST


బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుతున్నారు ప్రభాస్. బాహుబలి అనంతరం వచ్చిన సాహో చిత్రం సైతం టాక్ తో సంబందం లేకుండా బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ప్రభాస్ చేసే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ గా మారుతోంది.

ఇప్పటి వరకూ బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ కలిగి ఉన్న స్టార్స్ సైతం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి అవాక్కు అవుతున్నారు అని చెప్పాలి. ప్రభాస్ తను చేసే ప్రతి ఒక్క సినిమా కు కూడా 100 కోట్ల రూపాయల కి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా చిత్రానికి ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. స్పిరిట్ అంటూ సరికొత్త పోస్టర్ తో చిత్ర యూనిట్ టైటిల్ ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం కి ప్రభాస్ 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

ప్రభాస్ ప్రస్తుతం సలార్ మరియు ప్రాజెక్ట్ కే షూటింగ్ లలో బిజిగా ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ప్రభాస్ చేస్తున్న సినిమాలు, తీసుకుంటున్న పారితోషికాలతో ఇండియా లోనే నంబర్ వన్ హీరో అనడం లో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :