“లవ్ స్టోరీ” రిలీజ్‌పై స్పందిస్తూ ప్రభాస్ ఏమన్నాడంటే..!

Published on Sep 24, 2021 1:47 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” చిత్రం రేపు థియేటర్లలో విడుదల కాబోతుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి.

అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా రిలీజ్‌పై స్పందిస్తూ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “లవ్ స్టోరీ” అని అన్నారు. మీ దగ్గర్లోని థియేటర్లకు వెళ్లి సినిమాను ఆస్వాదించి రావాలని అన్నారు. అంతేకాకుండా సినిమాలకు గోల్డెన్ డేస్‌ని తీసుకురావలని అన్నారు.

సంబంధిత సమాచారం :