ట్రైలర్ చూసాక “భజే వాయు వేగం” పై ప్రభాస్ రెస్పాన్స్

గత కొన్నేళ్లలో ఒక్క టాలీవుడ్ అనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే ఒక డల్ సమ్మర్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. సరైన సినిమాలు లేక దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో డల్ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ మే నెలాఖరున మన టాలీవుడ్ నుంచి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన చిత్రం “భజే వాయు వేగం” కూడా ఒకటి.

మరి నిన్న వచ్చిన ట్రైలర్ అందరినీ బాగా ఇంప్రెస్ చేయగా దీనిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా స్పందించాడు. ట్రైలర్ చూసేందుకు ఆసక్తికరంగా ఉందని హీరో కార్తికేయ అలాగే యూవీ కాన్సెప్ట్స్, టోటల్ చిత్ర యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాను అని ప్రభాస్ తెలిపాడు. దీనితో యూవీ మేకర్స్ ప్రభాస్ కి థాంక్స్ చెప్తూ పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి పని చేసాడు.

Exit mobile version