ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ అప్పుడే.?

Published on Jul 16, 2021 11:30 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో “రాధే శ్యామ్” మినహా మిగతా సినిమాలు అన్నిటికీ అనౌన్సమెంట్స్ టైం లో ఎలాంటి హైప్ నెలకొందో తెలిసిందే. ముఖ్యంగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం చెప్పక్కర్లేదు.

ఇలా జస్ట్ అనౌన్సమెంట్స్ తోనే పాన్ ఇండియన్ వైడ్ సాలిడ్ హైప్ నమోదు చేస్తున్న ప్రభాస్ నుంచి మరో భారీ సినిమా అనౌన్సమెంట్ వచ్చే సెప్టెంబర్ నెలలో రానుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే మరో బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో.. ఈ కాంబోపై ఎప్పటి నుంచో బజ్ ఉంది అది కాస్తా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి ఈ టోటల్ కాంబో నుంచే అనౌన్సమెంట్ రానుందట. మరి ఇది ఎంతమేర నిజం కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :