“రాధే శ్యామ్” సెట్స్ నుంచి వైరల్ అవుతున్న ప్రభాస్ పిక్.!

Published on Jan 19, 2022 9:37 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉండి రిలీజ్ కావాల్సి ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా వల్ల లాస్ట్ మినిట్ లో ఈ చిత్రం రిలీజ్ కరోనా మూడో వేవ్ మూలాన ఆగిపోయింది.

దీనితో మళ్ళీ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ కూడా ఏమి లేక అవీ ఆగిపోయాయి. అభిమానులు కూడా తమ ఎగ్జైట్మెంట్ ని ఇంకా బిగపట్టే ఎదురు చూస్తున్నారు. అలాంటి వీరికి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ పిక్ ప్రభాస్ ది సోషల్ మీడియాలో బయటకొచ్చి వైరల్ అవుతుంది. సినిమా సెట్స్ లో వెనుక గ్రీన్ మ్యాట్ తో ఒక బ్యూటిఫుల్ సన్నివేశంలా అనిపిస్తుంది.

పైగా ప్రభాస్ మంచి హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తుంది. అలాగే ఇందులో పూజా హెగ్డే కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో ఈ కొత్త పిక్ ప్రభాస్ అభిమానులు మధ్య వైరల్ అవుతూ ఈ గ్యాప్ లో కాస్త ఆనందాన్ని ఇస్తుంది.

సంబంధిత సమాచారం :