“రాధే శ్యామ్” గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం.!

Published on Apr 23, 2022 2:06 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో మొదటి భారీ పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేమికుల మనసులు గెలుచుకుంది. అయితే కమెర్షియల్ గా సిల్వర్ స్క్రీన్ పై అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు కానీ ఓటిటి లో వచ్చాక చాలా మంది నుంచి మంచి రెస్పాన్స్ నే అందుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఇపుడు ఈ చిత్రం గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉన్నట్టు ప్రభాస్ తెలుపుతున్నాడు. అయితే ఇది హిందీ వెర్షన్ లో మాత్రమే. హిందీలో రాధే శ్యామ్ సినిమా రేపు ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ కాబోతున్నట్టుగా తెలిపాడు. స్మాల్ స్క్రీన్ పై ప్రభాస్ సినిమాలకి హిందీలో మంచి క్రేజ్ ఉంది ఇక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :