ఆ బిగ్ స్టార్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్..!

Published on Mar 9, 2022 11:35 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమాకు తెలుగులో రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వగా, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్, హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారు. అయితే వీరికి గతంలోనే మేకర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపగా, తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వీరికి స్పెషల్ థ్యాంక్స్ తెలిపాడు. రాధేశ్యామ్ కి మీరంతా అద్భుతమైన గాత్రాన్ని అందించారని, ఈ చిత్రాన్ని మాతో పాటు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా అందించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఓ నోట్ ద్వారా తెలిపాడు.

సంబంధిత సమాచారం :