ప్రభాస్ ‘సలార్’ తో హృతిక్ ‘ఫైటర్’ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా …?

ప్రభాస్ ‘సలార్’ తో హృతిక్ ‘ఫైటర్’ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా …?

Published on Aug 17, 2022 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం కెజిఎఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ సలార్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ లో శృతి హాస హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మొన్న యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

అయితే అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనె కలిసి నటించనున్న ఫైటర్ మూవీ కూడా సరిగ్గా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28నే విడుదల కానున్నట్లు చాలారోజుల క్రితమే ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో సైనిక వీరత్వాన్ని చిట్టిచెప్పే కథాంశంతో సాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫైటర్ రూపొందనుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీతో పాటు ప్రభాస్ సలార్ కూడా ఒకేసారి రిలీజ్ అయితే వీటి రెండిటి మధ్య అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ తప్పదని తెలుస్తోంది. కాగా ఈ రెండు సినిమాల్లో రిలీజ్ సమయానికి ఏదైనా వెనక్కి వెళుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని ఆగాలని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు