‘సలార్’లో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఇదే.. అద్భుతం అట !

‘సలార్’లో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఇదే.. అద్భుతం అట !

Published on Jul 10, 2022 2:30 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ సినీ చరిత్రలోనే చాలా కొత్తగా వినూత్నంగా ఉంటుందట. భారీ లోయలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుందట. ఈ లోయలో అండర్ గ్రౌండ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ప్రభాస్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట. ఇక కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ సిరీస్ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది.

అందుకే అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు