సముద్రంలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ !

సముద్రంలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ !

Published on Mar 7, 2022 11:00 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. పైగా పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం ఇది. అందుకే, ‘సలార్’ సినిమా పై నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం సముద్రంలో ఫైట్ జరుగుతుంది అని.. ముఖ్యంగా సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

పైగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. అందుకే అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించబోతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు