ప్రభాస్ సలార్ లో ఆ సీక్వెన్స్ మళ్ళీ రీషూట్ !

Published on Dec 6, 2021 9:00 am IST

‘సలార్’ సినిమా పై నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. నేషనల్ స్టార్ గా ప్రభాస్ కి భారీ క్రేజ్ వచ్చాక, చేస్తున్న మొట్టమొదటి పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం ఇది. అందుకే, సలార్ పై బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. అందుకేనేమో అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు.

నిజానికి ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :