వైరల్ పిక్స్ : ‘సలార్’ నుండి ప్రభాస్ పిక్స్ లీక్

వైరల్ పిక్స్ : ‘సలార్’ నుండి ప్రభాస్ పిక్స్ లీక్

Published on Jan 26, 2023 1:58 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ప్రఖ్యాత కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈశ్వరి రావు, జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క షూట్ లొకేషన్ నుండి నేడు కొన్ని పిక్స్ లీక్ అయి కొద్దిసేపటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ లో మాస్ స్టన్నింగ్ లుక్ లో ప్రభాస్ అదిరిపోయారు. అలానే ఈ స్టిల్స్ చూస్తుంటే తమ హీరో ప్రభాస్, సలార్ తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే అనధికారికంగా సలార్ నుండి పిక్స్ లీక్ కావడంతో యూనిట్ ఇకపై ఇటువంటివి జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రేక్షకాభిమానులు కోరుతున్నారు. కాగా అటువంటి లీక్డ్ పిక్స్ పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మేము పోస్ట్ చేయడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు