ప్రభాస్ ‘సలార్’కి కొత్త రిలీజ్ డేట్ ?

Published on Sep 3, 2023 7:02 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. నవంబర్ 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుందని టాక్. సలార్ సీజీ వర్క్ ఇంకా పూర్తీ కాలేదని టాక్. ఐతే, ‘రోబో 2’ సినిమా కోసం గ్రాఫిక్స్ కాంట్రాక్ట్ తీసుకుని సరిగ్గా చేయని సంస్థకే సలార్ టీమ్ కూడా తమ సినిమా సీజీ పనులను ఇవ్వడం మిస్టేక్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సలార్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెబుతుంది. పైగా ‘సలార్‌’ కోసం మొత్తం ఐదు భాషల్లోనూ తన సొంత గొంతునే వినిపించనుందట.

ఇప్పటికే మూడు భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయని.. మరో రెండు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందని ఇప్పటికే శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రంలో శ్రుతి హాసన్.. ఆద్య అనే పాత్రలో కనిపించనుంది. ఇక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు ప్రభాస్ కెరీర్ లోనే సరికొత్త మాస లుక్ గా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నిలిచిపోతుందట. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ స్థాయిలో ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశాడట. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందుకే, ఈ సినిమాకి భారీ డిమాండ్ ఉంది.

సంబంధిత సమాచారం :