ప్రభాస్ “సలార్”లో విలన్‌గా మలయాళం స్టార్?

Published on Oct 21, 2021 2:19 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా “సలార్” సినిమాపై ఓ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ని ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా చిత్ర బృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

సంబంధిత సమాచారం :