అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రభాస్ !

27th, March 2017 - 08:39:20 AM


నిన్న సాయంత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’ ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరరంగా వైభవంగా జరిగింది. సంగీత దర్శకుడు కీరవాణీ వేడుకను ముందుండి నడిపించగా హాజరైన సినిమా క్రూ మొత్తం ప్రాజెక్ట్ పట్ల తమ అనుభవాలని, చిత్రం కోసం పడిన కష్టాల్ని, సినిమా ఎలా ఉండబోతోందో అనే వివరాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అలా ఒక్కొక్కరు మాట్లాడుతుండగా అభిమానులంతా తమ అభిమాన హీరో రెబర్ స్టార్ ప్రభాస్ ఏం మాట్లాడతారో వినాలని ఉత్కంఠగా ఎదురుచూశారు.

అలా వారు ఎదురుచూస్తుండగానే సినిమాటిక్ స్టైల్లో గాల్లో ఎగురుతూ వేదిక మీదికి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇన్నాళ్లు అభిమానులంతా ఒక సినిమా కోసం రెండేళ్లు, మరొక సినిమా కోసం ఇంకో రెండేళ్లు ఎదురుచూశారు. ఇకపై అలా ఉండదు. సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తాను. తప్పకుండా చేస్తాను కూడా అన్నారు. ప్రభాస్ మాట్లాడిన ఆ కొద్ది మాటలతోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇకపై తమ హీరో నుండి ఏడాదికి రెండు సినిమాలు చూడొచ్చని సంబరపడిపోయారు.