“బిల్లా” 4కే షో లో ఫ్యాన్స్ తో దర్శకుడు మెహర్, ప్రభాస్ సోదరి.!

“బిల్లా” 4కే షో లో ఫ్యాన్స్ తో దర్శకుడు మెహర్, ప్రభాస్ సోదరి.!

Published on Oct 23, 2022 12:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే ఈరోజు కావున సోషల్ మీడియా సహా బయట కూడా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ తమ అభిమాన హీరో బర్త్ డే ని పండుగలా జరుపుకుంటున్నారు. మరి తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా అయితే అందరి ఫ్యాన్స్ లానే వీరు కూడా బిల్లా చిత్రంని స్పెషల్ షోస్ ప్లాన్ చేసుకోగా దీనిని తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

మరి ఈ రిలీజ్ లో భాగంగా హైదరాబాద్ దేవి థియేటర్ లో వేసిన షో కి గాను ప్రభాస్ సోదరి ప్రశీదా ఉప్పలపాటి మరియు చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ లు హాజరయ్యి ఈ మాస్ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకున్నారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ సినీ వర్గాల్లో మరియు ప్రభాస్ ఫ్యాన్స్ లో అయితే మంచి వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో అయితే లెజెండరీ నటులు కృష్ణం రాజు గారు ముఖ్య పాత్ర పోషించగా అనుష్క, నమిత తదితరులు నటించారు. అలాగే మణిశర్మ సాలిడ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు