సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్న ప్రభాస్
Published on Jun 13, 2017 12:59 pm IST


బాహుబలి 2 చిత్ర ఘనవిజయం తరువాత ప్రభాస్ స్టార్ డం జాతీయ స్థాయికి వ్యాపించింది. దీనితో ప్రభాస్ తాను నటించబోయే తదుపరి చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

బాహుబలి మొదటి భాగంలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో మారు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సాహో చిత్రంలో సిక్స్ పాక్స్ తో కనిపించడానికి ప్రభాస్ కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ కండల ప్రదర్శన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదు.

 
Like us on Facebook