“రాధేశ్యామ్” లవ్ స్టోరీనే కానీ చాలా ట్విస్టులు ఉన్నాయి – ప్రభాస్

Published on Dec 24, 2021 3:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నానని, పెదనాన్నగారి ఫోటో చూశారు కదా.. చిన్నపాటి దేవుడిలా ఉన్నారు కదా అని అన్నారు. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుందని, పెదనాన్న గారి మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేశారు.. ఆ తరువాత బిల్లా, ఇప్పుడు రాధేశ్యామ్ అని అన్నారు.

అయితే ఈ సినిమా కథ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ.. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయని, క్లయిమాక్స్ అందరికి నచ్చుతుందని అన్నారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో సాహో వలన కొద్ది రోజులు ఆగిందని, ఇంకొన్ని రోజులు కరోనా వలన ఆగిందని ఐదేళ్ల పాటు ఒక సినిమా కోసం కూర్చోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమని, ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడు రాధాకృష్ణకే దక్కుతుందని అన్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని, సినిమా కోసం కష్టపడ్డ వారికి కూడా థ్యాంక్స్ అని అన్నారు.

సంబంధిత సమాచారం :