“సలార్” కి డబ్బింగ్ షురూ చేసిన “ప్రభాస్”

Published on Sep 6, 2023 9:00 am IST


సౌత్ నుండి భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కి రెడీ గా ఉన్న భారీ బడ్జెట్ మూవీ సలార్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 28 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వాయిదా పడింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణం గా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం కి సంబందించిన డబ్బింగ్ వర్క్ షురూ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషలలో స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఈ డబ్బింగ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. మేకర్స్ ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :