‘కొరియన్‌ కనకరాజు’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్ !

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టీజర్‌ను స్వయంగా ప్రభాస్ డిజిటల్ వేదికగా విడుదల చేయనున్నారు.

ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ మద్దతు ఈ సినిమా ప్రచారానికి ఫుల్ జోష్ ను ఇవ్వడమే కాకుండా, ఈ చిత్రంపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘కొరియన్ కనకరాజు’లో సత్య కూడా కీలకమైన హాస్య పాత్రను పోషిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. హారర్, కామెడీ మరియు ఇండో-కొరియన్ అంశాల కలయికతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా ఈ సినిమా రూపొందుతోంది.

Exit mobile version