రాజమౌళిపై తనకే నమ్మకం లేని వేళ ప్రభాస్ దృఢ నమ్మకం.!

రాజమౌళిపై తనకే నమ్మకం లేని వేళ ప్రభాస్ దృఢ నమ్మకం.!

Published on Dec 13, 2022 12:07 PM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు ఎంతలా మారు మోగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో ఇంటర్నేషనల్ వైడ్ తన తాజా చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో మరోసారి తెలుగు సహా ఇండియన్ సినిమా పేరుని మరో స్థాయిలోకి తీసుకెళ్లిన రాజమౌళి పై సినిమా ప్రముఖులు అనేకమంది ప్రశంసలు కురిపిస్తుండగా తాను మొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు పొందిన చిత్రం “బాహుబలి” హీరో ప్రభాస్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు.

మరి దీనితో అయితే తన ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. మరి ఇందులో అయితే “థాంక్ యూ డార్లింగ్ నాకు నమ్మకం లేని సమయంలోనే నువ్వు నాకు ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది అని నమ్మావు” అని ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని అయితే రివీల్ చేశారు. మరి దీనితో అయితే డెఫినెట్ గా ప్రభాస్ అభిమానులు చాలా ఆనందపడతారని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు