“సీటీమార్” కి ప్రభాస్ స్పెషల్ విషెష్ చూడాల్సిందే..!

Published on Sep 12, 2021 10:00 am IST


ఈ కోవిడ్ రెండో వేవ్ అనంతరం వచ్చిన భారీ చిత్రాల్లో మన టాలీవుడ్ మ్యాచో మెన్ గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సీటీమార్” ప్రధానమైనది. పలు పాన్ ఇండియన్ సినిమా, హిందీ సినిమాలకు కూడా రాని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి దీనితో ఈ ఏడాది లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలోకి ఈ సినిమా వెళ్ళింది.

అయితే ఈ చిత్రం హీరో గోపీచంద్ మరియు డార్లింగ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మంచి స్నేహితులు అని తెలిసిందే. పలు కారణాల చేత ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ కి రాలేకపోయాడు కానీ తన విషెస్ ని మాత్రం ఫోన్ కాల్ లో చెప్పాడని గోపీచంద్ ఆ ఈవెంట్ లో తెలిపాడు. మరి ఇప్పుడు ఈ సినిమాపై ప్రభాస్ తన ఎగ్జైట్మెంట్ ని తెలిపాడు.

తన సోషల్ మీడియా ద్వారా ఒక విజిల్ ని పెట్టి “నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కోవిడ్ సమయంలో మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేసి గొప్ప ప్రయత్నం చేసారని మ్యాచో మెన్ కి ఈ సాలిడ్ కటౌట్ విష్ చెయ్యడం జరిగింది. దీనితో ఇద్దరి హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత సమాచారం :