అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ !


యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ 2015లో విడుదలైన ‘బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తమైంది. ఆయన అభిమానుల సంఖ్య కూడా రెట్టింపైంది. ఆయన అభిమానులంతా త్వరలో రిలీజ్ కాబోతున్న ‘బాహుబలి-2’ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిత్రానికి సంబందించిన ఏ చిన్న అంశం బయటికొచ్చిన పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాహుబలి టీమ్ కూడా సినిమాకి సంబందించి ఏ అంశాన్ని బయటికొదిలినా కొన్నిరోజులు ముందుగా అభిమానులకు చెప్పి మరీ రిలీజ్ చేసేవారు.

కానీ ఈరోజు మాత్రం ప్రభాస్ ఏమాత్రం ముందస్తు సూచన లేకుండా ఫ్యాన్సును సప్రైజ్ చేశాడు. తను, అనుష్క కలిసున్న పోస్టర్లను బయటికొదిలి అందరికీ రిపబ్లిక్ డే గిఫ్ట్ ఇచ్చాడు. పోస్టర్లు కూడా అంచనాలకు తగ్గట్టు గ్రాండ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో బాహుబలి సందడి మొదలై సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అన్ని భాషలు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.