ప్రభాస్‌కి 50 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిన బడా నిర్మాత?

Published on Jan 25, 2022 3:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్దంగా ఉండగా, ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి. ఇవే కాకుండా మరో మూడు ప్రాజెక్టులను కూడా ప్రభాస్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ఇందులో భాగంగా డీవీవీ దానయ్య ప్రభాస్‌కు దాదాపు 50 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాడని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :