‘సలార్’ షూట్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Feb 7, 2023 10:44 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ కూడా ఒకటి. అయితే, సలార్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మార్చిలోనే సలార్ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ ఉండటం చేత.. వచ్చే నెలాఖరులో సలార్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. సలార్ సినిమాకు గానూ దాదాపు 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది.

కాగా మార్చి నెలాఖరుకు మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. పైగా యాక్షన్ సిక్వెన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ని తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :