అసలు ‘ది రాజా సాబ్’ మిస్ ఫైర్ అయ్యింది ఆ స్టేజ్ లోనే!

The Raja Saab

ఈ ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కలయికలో చేసిన హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్”(The Raja Saab) కూడా ఒకటి. సంక్రాంతి బరిలో డిజప్పాయింట్ చేసిన సినిమాగా ఇది ఈ ఏడాది నిలిచిపోయింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు అభిమానుల్లోనే రచ్చ కొనసాగింది. ఆ సీన్ ఇలా ఈ సీన్ అలా అంటూ చాలానే కామెంట్స్ వచ్చాయి. అయితే అసలు రాజా సాబ్ ఇంతలా మిస్ ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి?

ముందు ప్లాన్ చేసింది ఒకటి.. తీసింది ఒకటి..

ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో అన్నీ భారీ సినిమాలే చేస్తున్నారు. దీనితో ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ వాటిలో పెట్టడానికి కుదరడం లేదు. అందుకే ఒక క్విక్ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా త్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్టు ఆమధ్య టాక్ వచ్చింది. అదే మారుతితో ప్లాన్ చేసిన ఈ రాజా సాబ్. దీనిని ముందు కేవలం ఒక హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా మాత్రమే ప్లాన్ చేశారు. కానీ అది నెమ్మదిగా ఎటెటో వెళ్ళిపోయి చివరికి నిరాశనే మిగిల్చింది.

కథ కూడా వేరేనా?

రాజా సాబ్ ని ముందు ఒక క్విక్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేసినప్పటికి కథ కూడా వేరే గానే ప్లాన్ చేసుకున్నట్టు వినిపించింది. మెయిన్ గా సంజయ్ దత్ రోల్ ని మారుతి మరోలా డిజైన్ చేశారట.

ఒకవేళ ముందు అనుకున్నట్టుగా ఒక క్విక్ ప్రాజెక్ట్ గానే దీనిని ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది కాబోలు.

Exit mobile version