తాప్సి సినిమాకు ప్రభాస్ ప్రమోషన్లు !
Published on Aug 13, 2017 3:22 pm IST


హిందీలో వరుస సక్సెస్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సి తెలుగులో చేస్తున్న సినిమా ‘ఆనందో బ్రహ్మ’. హర్రర్ – కామెడీ జానర్లో రోపొందిన ఈ చిత్రం రొటీన్ హర్రర్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇకపోతే ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్లను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగానే ‘బాహుబలి’ తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్ ను రేపు జరగనున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించనుంది. 70 ఎమ్ఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ మరియు శశి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మహి.వి. రాఘవ డైరెక్ట్ చేయగా సీనియర్ కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, రఘులు పలు కీలక పాత్రల్లో నటించారు.

 
Like us on Facebook