క్రేజీ..మరో సాలిడ్ యూనివర్స్ లో ప్రభాస్..?

Published on Jan 29, 2023 1:25 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని కూడా చాలా మందికి తెలిసిందే.

అయితే ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడిప్పుడే పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ హైప్ నెలకొంటుంది. మరి ప్రభాస్ సలార్ తర్వాత అయితే మరో సాలిడ్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించనున్నట్టుగా క్రేజీ బజ్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది ఎంతవరకు రియాలిటీ లోకి వస్తుందో కానీ ప్రభాస్ నెక్స్ట్ తన లైనప్ లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో సిద్ధార్థ్ సినిమాల్లో గాను ప్రభాస్ కూడా కనిపిస్తాడా అనే టాక్ మొదలైంది. అయితే బహుశా ఇది కావచ్చు కాకపోవచ్చు అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మరో సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ కనపడతాడు అనే సౌండింగ్ మాత్రం ఫ్యాన్స్ లో మరింత క్రేజీగా మారింది.

సంబంధిత సమాచారం :