హాట్ బజ్..ఓ ఇంట్రెస్టింగ్ క్విక్ ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రభాస్?

Published on Jan 22, 2022 10:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ రెండు సినిమా షూటింగ్ కూడా పూర్తి కాగా ఒకటి రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. మరి ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రభాస్ ఆల్రెడీ మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నా వాటికి బ్రేక్ ఇచ్చి ఒక నాన్ ఇండియన్ క్విక్ ప్రాజెక్ట్ ని చెయ్యాలని అనుకుంటున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర అంశాలు ఇపుడు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించనుండగా ఇదొక హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది అని తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా క్విక్ ప్రాజెక్టే అయినా పాన్ ఇండియన్ లెవెల్లో కూడా ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి అయితే ప్రభాస్ పై ఈ క్విక్ ప్రాజెక్ట్ కోసం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :