‘మహానుభావుడు’ ఆడియో వేడుకకు అతిధిగా ‘బాహుబలి’ !

12th, September 2017 - 01:20:55 PM


ఈ ఏడాది ఆరంభంలో ‘శతమానంభవతి’ తో మంచి హిట్ అందుకున్న యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం ‘మహానుభావుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. అందుకే టీమ్ ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ప్రభాస్ ను వేడుకకు ముఖ్య అతిదిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం.

‘బాహుబలి’ సిరీస్ తో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రెజెన్స్ తో ఈ చిత్రం మరింతగా జనాల్లోకి వెళ్లే ఆస్కారముంది. సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్వాహకులు ప్రభాస్ కు బాగా సన్నిహితులు కావడంతో ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు.