ప్రభాస్ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా ?
Published on Jan 13, 2018 10:14 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రభాస్ ఈ చిత్రంతోపాటే మరొక చిత్రాన్ని కూడా మొదలుపెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణతో ఒక ప్రాజెక్ట్ కు గతంలో కమిటైన విషయం విధితమే.

రొమాంటిక్ ఎంటరైనర్ గా ఉండనున్న ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి పెద్దగా సమయం పట్టదట. అందుకే ఎక్కువ సమయం తీసుకుంటున్న ‘సాహో’ తో పాటే ఆ చిత్రాన్ని కూడా కానిచ్చేస్తే రెండూ ఒకేసారి సిద్దమైపోతాయనే ఆలోచనలో ఉన్నారట ప్రభాస్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook