టాక్..ఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్.?

Published on Jun 3, 2022 7:02 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో లేటెస్ట్ గా అయితే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” అలాగే మరో భారీ సినిమా “ఆదిపురుష్” చిత్రాలు సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. అలాగే ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఉంది. అయితే ఈ సినిమాల్లో ప్రభాస్ ఇప్పుడు ఓ సినిమా కోసం కాస్త బరువు తగ్గనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

ఆ సినిమా ఏదో కాదు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న “సలార్” కోసమే అట. అయితే ప్రభాస్ తో స్టార్టింగ్ లో చేసిన లుక్ కోసం కొన్ని కిలోల బరువు తగ్గాలని నీల్ ప్రభాస్ కి సూచించాడట. దీనితో ప్రభాస్ మళ్ళీ లీనియర్ గా మారి స్టన్నింగ్ గా కనిపిస్తాడట. మరి దీనిలో ఎంతమేర నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :