క్రేజీ అప్డేట్.. ప్రభాస్ భారీ సినిమా “స్పిరిట్” లో డ్రీమ్ రోల్ కన్ఫర్మ్.!

Published on Jan 4, 2022 4:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టేకప్ చేసిన సాలిడ్ లైనప్ లో ఫస్ట్ పాన్ ఆసియా భారీ చిత్రం “స్పిరిట్”. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఆ జస్ట్ అనౌన్సమెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ ని తెచ్చుకుంది. మరి ఇంతలా హైప్ ని సెట్ చేసి పెట్టిన ఈ సినిమా టైటిల్ నుంచే అంతా బ్రేక్ డౌన్ స్టార్ట్ చేశారు. సినిమా ప్లాట్ ఏ దేశంలో ఉంటుంది? ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు?

ఎన్ని భాషల్లో ఒకేసారి తీస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ పాన్ ఆసియన్ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమిటి అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలాగే ప్రభాస్ “ఆదిపురుష్” కి కూడా నిర్మాత అయినటువంటి భూషణ్ కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చెయ్యడం జరిగింది.

ప్రభాస్ “స్పిరిట్” సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలిపారు. దీనితో ప్రభాస్ ని ఎప్పుడు నుంచో చూడాలి అనుకుంటున్నా డ్రీం రోల్ అతని ఫ్యాన్స్ కి ఈ సినిమాతో తీరిపోయినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :