‘ఆదిపురుష్’ యుఎస్ఏ ప్రమోషన్స్ లో పాల్గొననున్న ప్రభాస్ ?

Published on Jun 11, 2023 2:00 am IST

తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ లెవెల్లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మైథలాజికల్ జానర్ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచాయి అని చెప్పాలి. ఇందులో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకి గా కనిపించనుండగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ పాత్ర చేస్తున్నారు.

టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థ ల పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, అతి త్వరలో ఆదిపురుష్ ని యుఎస్ఏ లో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేయదల్చిందట యూనిట్. అందుకోసం ప్రభాస్ యుఎస్ఏ వెళ్లనున్నారని అంటున్నారు. అక్కడి పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ తో ప్రభాస్ ఇంటరాక్ట్ అవనున్నారట. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో బజ్ గా ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై ఆదిపురుష్ మేకర్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :