ఒకేసారి రెండు సినిమాల్లో నటించనున్న ప్రభాస్ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రంతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూఎస్ హాలిడేలో ఉన్న ప్రభాస్ ట్రిప్ నుండి తిరిగిరాగానే ‘సాహో’ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నాడు. దాంతో పాటే ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాని ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండటం విశేషం. ఇకపోతే ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాది మధ్యలోనే మొదలుకానుంది. కనుక ప్రభాస్ ‘సాహో’తో పాటు ఈ కొత్త సినిమా షూటింగ్లో కూడా ఒకేసారి పాల్గొననున్నాడు. ఇకపోతే ఈ కొత్త చిత్రంలో హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.