టాక్..ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” లో అడుగు పెట్టేది అప్పుడే.?

Published on Nov 26, 2021 12:22 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు కంప్లీట్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే వీటి తర్వాత మరో పాన్ ఇండియన్ సినిమా పాన్ వరల్డ్ సినిమాలు కూడా లైన్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న భారీ సినిమా “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి.

మొత్తం హాలీవుడ్ స్థాయిలోనే భారీ బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఐతే ఈ సినిమా ఆల్రెడీ ప్రభాస్ లేకుండా దిగ్గజ నటులు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొనె లతో షూట్ కూడా జరిగింది.

అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ ఎప్పుడు ఈ షూటింగ్ లో అడుగు పెట్టనున్నాడో టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం వచ్చే డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More