స్టార్ హీరోతో కలిసి ఓ భారీ హాలీవుడ్ సినిమా చూసిన ప్రభాస్.!

Published on Aug 3, 2022 9:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాలు వరుస షూటింగ్స్ తో ప్రభాస్ బిజీ బిజీ గానే ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ షూటింగ్స్ గ్యాప్ లో అయితే ప్రభాస్ ఓ భారీ హాలీవుడ్ సినిమా మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరోతో కలిసి చూసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ చక్కర్లు కొడుతుంది.

మరి ప్రభాస్ హైదరాబాద్ లో ప్రసాద్స్ ఐమాక్స్ లో రీసెంట్ హాలీవుడ్ హిట్ “టాప్ గన్ మావెరిక్” సినిమాని చూశాడని తెలుస్తుంది. మరి అది కూడా మన టాలీవుడ్ స్టార్ హీరో పైగా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి గోపీచంద్ తో కలిసి ఈ సినిమా చూసినట్టుగా టాక్ వైరల్ గా మారింది. అయితే వీరి విజువల్స్ అయితే బయటకి ఏం రాలేదు కానీ కలిసి సినిమా ఎంజాయ్ చేసారని మాత్రం తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :