టాక్..బాలయ్య తో పాన్ ఇండియా స్టార్ ఆల్ మోస్ట్ ఫిక్స్.?

టాక్..బాలయ్య తో పాన్ ఇండియా స్టార్ ఆల్ మోస్ట్ ఫిక్స్.?

Published on Dec 2, 2022 9:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ ఆదిపురుష్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో బిజీ గా ఈ స్టార్ హీరో నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ తో కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించనున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇది బాలయ్య టాక్ షో ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాప్పబుల్ 2 కి గాను ప్రభాస్ ఓ స్పెషల్ ఎపిసోడ్ లో గెస్ట్ గా రాబోతున్నట్టు పలు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలో రానున్నట్లు గా తెలుస్తోంది..

మరి బాలయ్య స్పీడ్ కి షో లో ప్రభాస్ కామ్ అండ్ ఇనోసెన్స్ తోడైతే ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక అలాగే బాలయ్య ఈ షో తో పాటుగా ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు